రామ్ చరణ్ క్లీంకార కోసమే ఎక్కువ టైం కేటాయిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. క్లీంకారతో ఉంటే టైం తెలియదని, ఈ మధ్య షూటింగ్‌లు కూడా త్వరగానే ఫినిష్ చేసుకుంటున్నానని, సాయంత్రం ఆరు గంటలకే ప్యాకప్ చెప్పేసి ఇంటికి వెళ్లి క్లీంకారతో టైం గడుపుతున్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చిన విషయాలు బాగానే వైరల్ అయ్యాయి. ఇక తన చేతుల్తో తినిపిస్తే క్లీంకార మొత్తం తినేస్తుందని, తనంతా బాగా ఇంట్లో ఎవ్వరూ తినిపించలేరని రామ్ చరణ్ తన గురించి తాను చెప్పుకున్న సంగతులు బాగానే వైరల్ అయ్యాయి. తండ్రిగా రామ్ చరణ్ ఎంతటి అనుభూతిని పొందుతున్నాడో ఆ మాటల్లోనే తెలిసి వచ్చేస్తుంది. ఇక నిహారిక కూడా తాజాగా క్లీంకార, రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. నిహారిక ప్రస్తుతం కమిటీ కుర్రోళ్లు అనే సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. నిహారిక నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 9న రాబోతోంది. ఈ క్రమంలో నిహారిక ప్రమోషన్స్ అంటూ ఫుల్ బిజీగా తిరిగేస్తోంది. మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను పంచుకుంటోంది.
ఈ క్రమంలోనే రామ్ చరణ్, క్లీంకార సంగతుల్ని పంచుకుంది. క్లీంకార మీద ఇంట్లో అందరి దృష్టి ఉంటుంది.. అందరినీ తన వైపే తిప్పేసుకుంటుందని, క్లీంకార చాలా నాటీ అని.. చరణ్ అన్నని ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పుకొచ్చింది. తినిపించేందుకు ఎంతో బతిమిలాడుతాడని, ఇంట్లో ఉన్న పెట్స్‌ని చూపిస్తూ తినిపిస్తుంటాడని తెలిపింది. ఇక రామ్ చరణ్ అయితే ఏ పనీ పాట లేనట్టుగా.. సినిమాలు లేనట్టుగా.. ఇంటికి వస్తే తన కూతురే ప్రపంచంగా ఉంటాడని, చరణ్ అన్నే ది బెస్ట్ ఫాదర్ అంటూ నిహారిక చెప్పేస్తోంది. నిహారిక ఇప్పుడు కోలీవుడ్‌లో నటిస్తోంది. టాలీవుడ్‌లో కేవలం నిర్మాతగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తోంది. మంచి కథ దొరికితే ఇక్కడ కూడా నటిస్తానని చెబుతోంది. కానీ నిహారికకు టాలీవుడ్‌లో లీడ్ యాక్ట్రెస్ పరంగా చూసుకుంటే ఇంత వరకు ఒక్క హిట్ రాలేదు. అదే నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్‌లు మంచి సక్సెస్‌ను అందించాయి.