వారంలో రెండు సార్లు ఉపవాసం..
ఇటీవల జర్మన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయనంలో అప్పుడప్పుడూ ఉపవాసాలు చేయడం వల్ల కాలేయం, క్యాన్సర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకున్నారు. వారంలో ఐదు రోజుల పాటు క్రమంగా తిని.. రెండు రోజుల పాటు ఉపవాసం చేయడం వల్ల కాలేయ క్యాన్సర్ ప్రమాదం నివారించవచ్చని నిపుణులు తేల్చారు. వైద్యుల సలహా తీసుకోవాలి..
ఉపవాసం ఉండటం వల్ల క్యాన్సర్ కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఉపవాసం చేయడం వల్ల శరీరంలో ఉండే చెడిపోయిన కాలు శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు ముదరక ముందే ఈ కణాలను నాశనం చేస్తుంది. అయితే ఉపవాసం చేయాలా? వద్దా? అన్నది వైద్యుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొరి శరీరం ఒక్కోలా ఉంటుంది.