ఆధునిక జీవితంలో ఇవాళ వయసుతో సంబంధం లేకుండాఎంతోమంది మలబద్ధకంతో బాధపడుతున్నారు. ప్రతిరోజూ విరేచనం సాఫీగా కాకుంటే అది మానసిక ఒత్తిడికీ దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొందరికి వైద్య చికిత్స కూడా అవసరమవతుండగా, ఆహార అలవాట్లలో మార్పులతో మలబద్ధకాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మామి అగర్వాల్ మలబద్ధకానికి చెక్ పెట్టేందుకు అనువైన ఆహారాలను ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో వివరించారు. నిర్ధిష్ట ఆహార పదార్ధాలతో సుఖ విరేచనం సాధ్యమవుతుందని ఈ పోస్ట్‌లో ఆమె రాసుకొచ్చారు. తాను సూచించిన ఆహారాన్ని ప్రయత్నిస్తే మీరిక మలబద్ధకాన్ని మరచిపోవచ్చని ఆమె తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. మలబద్ధకాన్ని నివారించేందుకు ఎండు ద్రాక్షను మించింది లేదని ఈ స్మాల్ ఫ్రూట్స్ ఫైబర్‌తో నిండి జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు సహకరిస్తాయని ఆమె చెబుతున్నారు. ఇందులో ఉండే సార్బిటాల్, ఫెనోలిక్ పదార్ధాలు గ్యాస్ట్రోఇంటెస్టినల్‌కు సహకరిస్తాయి. ఇక యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఫుష్కలంగా ఉండే చియా సీడ్స్ జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది. ప్రేవుల్లో వాపును ఇవి నివారించడంలో ఉపకరిస్తాయి. మలబద్ధకాన్ని నివారించే ఆహార పదార్ధాలివే..
ఎండు ద్రాక్ష చియా సీడ్స్ డేట్స్ అలోవిర జ్యూస్ దాల్చిన చెక్క టీ