ట్రిపుల్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు కేరక్టర్‌లో చరణ్‌ని చూసిన వారందరికీ గూస్‌బంప్స్ వచ్చాయి. ఎక్కడా సెంటిమీటర్ కూడా తేడా లేకుండా పర్ఫెక్ట్ టైలర్‌మేడ్ కేరక్టర్ అన్నట్టు పోట్రే చేశారని ప్రశంసలు కురిపించారు. సెమీ ఫిక్షనల్ కేరక్టర్‌గా ట్రిపుల్ ఆర్‌లో చరణ్ కేరక్టర్‌ని తీర్చిదిద్దారు జక్కన్న.
ఇప్పుడు అలాంటిదే ఇంకాస్త కొత్తగా ట్రై చేయబోతున్నారు చెర్రీ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు కొత్తగా స్ప్రెడ్ అవుతున్న వార్తలు కాకపోయినా, గతేడాది ఒకసారి వెలుగులోకి వచ్చిన మాటే అయినా, మరోసారి మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ న్యూస్. ఉప్పెన్ ఫేమ్ బుచ్చిబాబు కోసం చెర్రీ చేయబోయే సినిమా గురించే ఈ మాటలన్నీ.
బుచ్చిబాబు డైరక్షన్‌లో చరణ్ ఓ స్పోర్ట్స్ డ్రామాలో యాక్ట్ చేస్తారనే మాట ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆ సినిమా ప్రముఖ రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తారన్నది తాజాగా స్ప్రెడ్ అవుతున్న మాట.
సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుందనే మాట కూడా ఈ వైరల్ టాక్‌కి ఊతమిస్తోంది. లైఫ్‌లో ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని ట్రై చేయాలని కసిగా ఉండే చరణ్, ఈ బయోపిక్‌కి ఓకే చెప్పి ఉంటారంటూ సంబరపడుతున్నారు మెగా ఫ్యాన్స్ 🌟
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారు. ఇందులో చరణ్ సరికొత్తగా కనిపిస్తారని, శంకర్ మార్క్ ఉంటూనే, చరణ్‌కి స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టే సినిమా అవుతుందని అంటున్నారు మేకర్స్ 🎥💥.