top of page
Shiva YT

పాకిస్థాన్ చేతికి చైనా నిఘా నౌక 🚢

పాకిస్థాన్ నేవీలో మొట్టమొదటిసారిగా ఒక నిఘా నౌక చేరింది. అణు వార్ హెడ్లు ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా పసిగట్టే సామర్థ్యం ఉన్న ఈ నౌకను చైనా నుంచి సమకూర్చుకుంది. అలాగే ఈ నౌక ఇతర కీలక సమాచారాన్నీ సేకరించగలదు. 87 మీటర్ల పొడవున్న ఈ నౌకకు పీఎన్ఎస్ రిజ్వాన్ అని పేరు పెట్టారు. ఈ షిప్‌లో రాడార్లు ఇతర ట్రాకింగ్ వ్యవస్థలు కలిగిన మూడు డోములున్నాయి. కాగా ఇప్పటికే భారత్ వినియోగిస్తున్న ఐఎన్ఎస్ ధ్రువ్ కంటే చిన్నది. 🚢



bottom of page