top of page
Suresh D

బింబిసార దర్శకుడితో చిరంజీవి చిత్రం... ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం..🎥🎞️

మెగా 157 చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు అట్టహాసంగా మొదలయ్యాయని వెల్లడించారు. ఇది సోషియో ఫాంటసీ చిత్రమని తెలిపారు. దీన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండడంతో భారీ హంగులకు లోటు ఉండదని అర్థమవుతోంది.

ఈమధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయాయి. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, ఇటీవల విడుదలైన భోళాశంకర్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశపరిచాయి. అయినప్పటికీ చిరంజీవి ఖాతాలో కొత్త చిత్రాలకు కొదవలేదు.తాజాగా ఆయన బింబిసార దర్శకుడు వశిష్టకు ఓకే చెప్పారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. చిరంజీవికి ఇది 157వ చిత్రం. చిత్రబృందం చిరంజీవిని ఆయన నివాసంలో కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోను దర్శకుడు వశిష్ట పంచుకున్నారు. మెగా 157 చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు అట్టహాసంగా మొదలయ్యాయని వెల్లడించారు. ఇది సోషియో ఫాంటసీ చిత్రమని తెలిపారు. దీన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండడంతో భారీ హంగులకు లోటు ఉండదని అర్థమవుతోంది.🎥🎞️


bottom of page