top of page

సీఎంకు చెక్ అందజేసిన చిరంజీవి..

MediaFx

మెగాస్టార్ చిరంజీవి ఆపద్బాంధవుడు అన్న సంగతి తెలిసిందే. కరోనా టైంలో అయినా, ప్రకృతి విపత్తులు సంభవించిన టైంలో అయినా ఆయన సాయం చేసేందుకు ముందుంటారు. తాజాగా వయనాడ్ బాధితుల్ని రక్షించేందుకు ముందుకు వచ్చారు. కేరళలో వయనాడ్ పరిస్థితి ఎలా మారింది.. కొండ చరియలు విరిగి పడటంతో గ్రామాలన్నీ నేలమట్టం అయ్యాయన్న సంగతి తెలిసిందే. వయనాడ్ పరిస్థితిని చూసి చలించిపోయిన చిరంజీవి తన కొడుకుతో కలిసి కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించారు. ఇతర ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్, అల్లు అర్జున్ వంటి వారు కూడా విరాళాలు ఇచ్చారు. ఇక చిరంజివి, రామ్ చరణ్ కలిసి కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించారు. వీరిద్దరే అత్యధిక మొత్తంలో విరాళం ఇచ్చారు. అయితే తాజాగా చిరంజీవి కేరళలో ల్యాండ్ అయ్యాడు. సీఎం పినరయి విజయన్‌ను స్వయంగా కలుసుకుని చెక్‌ను అందజేశారు. వయనాడ్ విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చిరంజీవి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు పీఎం మోదీని రిక్వెస్ట్ చేశారు. వయనాడ్‌ను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చిరంజీవి ఈ మేరకు చేసిన సాయానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆపదలు వచ్చిన ప్రతీ సారి ఇలా ఏదో ఒక రూపంలో సాయం అందిస్తూనే ఉంటారని చిరంజీవి మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు వశిష్ట తెగ కష్టపడుతున్నాడు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. స్టాలిన్ తరువాత ఈ జోడి మళ్లీ తెరపై కనిపించనుంది.

bottom of page