లాస్ట్ సినిమాను వదిలేయండి.. నెక్స్ట్ సినిమా మాత్రం కంపల్సరీగా హిట్ కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఇంతకీ వాళ్ల డిమాండ్ మెగాస్టార్ చిరంజీవికా? గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కా? లేక ఇద్దరికీనా..? ఎవరి డిమాండ్లు ఎలా ఉన్నా, చిరు అండ్ చెర్రీ మాత్రం ఒక విషయంలో సేమ్ టు సేమ్ ఒకే రకంగా డెసిషన్ తీసుకున్నారు.!
శంకర్ డైరక్షన్‌లో ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు నాయిక కియారా అద్వానీ. ఆమెతో ఇంతకు ముందు వినయ విధేయ రామా సినిమా చేశారు రామ్‌చరణ్.
బోయపాటి శ్రీను డైరక్షన్‌లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. వినయ విధేయ రామా ఫ్లాప్ అయింది కదా, ఈ కాంబో మరో సారి వర్కవుట్ అవుతుందా? అనే అనుమానాలేం పెట్టుకోలేదు డైరక్టర్ శంకర్. చెర్రీ పక్కన కియారా పర్ఫెక్ట్ అని ఫిక్స్ చేసేశారు.
గేమ్ చేంజర్ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అతి త్వరలోనే సినిమా డేట్‌ని కూడా అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ చెర్రీని చూసి ధైర్యం చేశారా?
లేకుంటే, మెగాస్టార్‌కి సెంటిమెంట్‌లు ఉండవా.. కాసేపు ఈ విషయాలను పక్కనపెడితే, ఆయన నెక్స్ట్ సినిమాలో త్రిష నటిస్తున్నారన్నది కన్‌ఫర్మ్డ్ న్యూస్. విశ్వంభరలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు చెన్నై సోయగం.
సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష మెగా ఆఫరే కొట్టేశారని కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు జనాలు. మరికొందరు మాత్రం.. చిరు, త్రిష జోడీ స్టాలిన్‌లో పెద్దగా వర్కవుట్ కాలేదన్న విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
అయినా సక్సెస్ రావాలంటే.. సినిమాలో సబ్జెక్ట్ ఉండాలి, మేకింగ్ వండర్‌ఫుల్‌గా ఉండాలి, రిలీజ్‌కి పర్ఫెక్ట్ సీజన్ కుదరాలి.. ఇంకా ఎన్నె.. ఎన్నెన్నో.! వాటన్నిటినీ వదిలేసి, విజయానికీ... హీరో, హీరోయిన్ల పెయిర్‌కీ... లింక్ పెట్టడం ఏంటన్నది తండ్రీ కొడుకుల ఒపీనియనేమో..అని అంటున్నారు విశ్లేషకులు.