top of page
MediaFx

బిగ్ బాస్ హౌస్‌లోకి చిరంజీవి ఫ్రెండ్! మెగా ఫ్యాన్స్ సపోర్టుతో..!


నయా సీజన్ కోసం కంటెస్టెంట్స్ ఎంపిక శరవేగంగా జరుగుతోంది. బుల్లితెర సెలబ్రిటీలు, యాంకర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు , అలాగే కొందరు వివాదాస్పద వ్యక్తులు బిగ్ బాస్ హౌ జ్ ‌లో అడుగుపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి రమేష్ తదితరుల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా ఈసారి ప్రముఖ నటుడు రోహిత్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్నాడని టాక్. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించాడు. సిక్టీన్, గర్ల్ ఫ్రెండ్, సొంతం, జానకీ వెడ్స్ శ్రీరామ్, గుడ్ బాయ్, కీలు గుర్రం, నేను సీతామాలక్ష్మి, నవ వసంతం, మా ఆయన బంగారం తదితర సినిమాల్లో సోలో హీరోగా మెప్పించాడు. అలాగే మెగాస్టార్ సూపర్ హిట్ మూవీస్ శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో చిరంజీవి స్నేహితుడి రోల్ లో మెరిశాడు. అయితే 2010 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయాడు రోహిత్. సుమారు 14 ఏళ్ల తర్వాత ఇటీవల RAM (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రంలో మెరిశాడీ హ్యాండ్సమ్ హీరో. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించేందుకు రోహిత్ రెడీ అయ్యాడని సమాచారం. ఒకవేళ నిజంగా అతను బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే.. మెగా అభిమానులు మొత్తం రోహిత్ కే సపోర్ట్ చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి అసలు రోహిత్ వస్తాడో ? లేదో? తెలియాలంటే బిగ్ బాస్ షో లాంఛింగ్ వరకు ఆగాల్సిందే.


bottom of page