top of page

సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం

సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం నంద్యాలలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు అబద్దాలు, మోసాలు చూశాం. ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నా. మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయమని కోరుతున్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయండి.బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? నారావారి పాలన రాకుండా చేసేందుకు మీరంతా సిద్ధమా? అంటూ ప్రజలను కోరారు. రైతులు, వృద్ధులు, సామాజికవర్గాల వారీగా ఆలోచన చేయండి. అంధులు కూడా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్లి మీ ఇల్లాలు, మీ పిల్లలు, మీ అవ్వా తాతలతో ఆలోచన చేయండి. ఎవరి వల్ల, ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది? మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉంది? అనేది ఆలోచన చేయండి. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అంటూ సీఎం జగన్ ప్రజలను కోరారు. మరోసారి ఫ్యానుకు రెండు ఓట్లు వేసి, ఇతరులతోనూ వేయించి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్ సభ స్థానాలు... మొత్తంగా 200కి 200 స్థానాల్లో గెలిపించి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా? అని ప్రజలను అడిగారు.

 
 
bottom of page