top of page
Shiva YT

అయోధ్య రాముడి పేరిట నాణేలు విడుదల.. రామ్‌లల్లా, అయోధ్య ఆలయ చిహ్నాలు.. 🪔🕊️

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మూడు సావనీర్ నాణేలను విడుదల చేశారు. ఇందులో బాల రామయ్య, అయోధ్యలోని రామజన్మభూమి ఆలయం థీమ్ ఆధారంగా ఒకటి.

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SPMCIL)కు సంబంధించిన 19వ స్థాపన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయోధ్యలోని రామ్ లల్లా , రామ జన్మభూమి దేవాలయం థీమ్‌తో కూడిన మూడు స్మారక నాణేలను ఆవిష్కరించారు. బుద్ధుని జ్ఞానోదయం అయిన స్థాప జ్ఞాపకార్థం ద్వి-లోహ కవచమైన సావనీర్ నాణేన్ని, భారతదేశంలో అంతరించిపోతున్న జంతువుల్లో భాగంగా ఖడ్గమృగం ఉన్న మరొక నాణెం.. ఇలా మొత్తం మూడు నాణేలను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ మాట్లాడుతూ.. SPMCIL సంస్థ విడుదల చేస్తున్న స్మారక స్టాంపులు లేదా నాణేలు తీసుకున్న ఇతివృత్తాలు ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయని చెప్పారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, పర్యావరణ ఆందోళనలు, దివ్యాంగులకు సంబంధించిన ఆందోళనలను తెలుసుకోవాలని సూచించారు. ఇలాంటి నాణేలు బహుమతిగా ఇవ్వడానికి విలువైన వస్తువులుగా మారడానికి తగినంత ఆకర్షణీయంగా మారతాయని పేర్కొన్నారు.

అయితే నాణేలు, స్టాంపులను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులకు ఈ స్మారక వెండి, ఆక్సిడైజ్డ్ మెటల్ నాణేలను సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ నుండి నామమాత్రపు ధరకు కొనుగోలు చేయవచ్చు. 📜🔐


bottom of page