🕌🌐 అయోధ్య రామాలయంపై స్మారక తపాలా స్టాంపులు..
- Shiva YT
- Jan 18, 2024
- 1 min read
🌍 యావత్ దేశం కాదు సమస్త ప్రపంచంలోని హిందూవులు, శ్రీరాముని భక్తులు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈరోజు, శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠా అభియాన్ అనే మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. శ్రీరామ జన్మభూమి ఆలయంపై 6 స్మారక తపాలా స్టాంపులతో కూడిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దేశ ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు. జనవరి 16న రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బుధవారం, ముందుగా ‘కలశ పూజ’ నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉపచారాలు జనవరి 21 వరకు కొనసాగుతాయని వివరించారు. అత్యంత ముఖ్య ఘట్టమైన రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ఠ’ మహోత్సవం జనవరి 22 న నిర్వహించనున్నట్లు ట్రస్ట్ అధికారులు తెలిపారు. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన “యజ్ఞం”లో పాల్గొంటారని వెల్లడించారు. 🌅🕍