top of page
MediaFx

పుంజుకున్న కాంగ్రెస్​.. మోదీ మ్యాజిక్​ తగ్గిందా?

లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు! ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తలకిందులు చేస్తూ.. అధికార ఎన్​డీఏకి విపక్ష ఇండియా కూటమి మంచి పోటీ ఇస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో విపక్షాలు తేలిపోయాయి. బీజేపీ- ఎన్​డీఏ సంచలన గెలుపును చూశాయి. అయితే.. 2024 లోక్​సభ ఎన్నికల విషయానికొస్తే.. ప్రస్తుత ట్రెండ్స్​ ప్రకారం.. విపక్ష ఇండియా కూటమి ఊహించిన దాని కన్నా మెరుగైన ప్రదర్శనే చేసేలా కనిపిస్తోంది!

ఉదయం 10:30 గంటలకు 543 సీట్లల్లో ఎన్​డీఏ కూటమి 284 సీట్లల్లో మెజారిటీలో ఉంది. మెజారిటీ మార్క్​ 272 కన్నా కాస్త ఎక్కువే. కానీ.. అందరిని షాక్​కు గురిచేస్తూ.. ఇండియా కూటమి 210 చోట్ల లీడింగ్​లో ఉంది. ఇండియా కూటమిలో ఒక్క కాంగ్రెస్​ పార్టీనే 94 సీట్లల్లో లీడింగ్​లో ఉంది. 2014లో ఈ పార్టీ 44 సీట్లు దక్కించుకుంది. 2019లో 52 సీట్లతో సరిపెట్టుకుంది. కానీ ప్రస్తుత ట్రెండ్స్​ని చూస్తుంటే.. నాటి ఘోర పరాభవం నుంచి కాంగ్రెస్​ కోలుకున్నట్టు కనిపిస్తోంది. ఈసారి నెంబర్లు పెరగడం ఖాయంగా ఉందని సమాచారం.

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. కేరళ వయనాడ్​తో పాటు యూపీ రాయ్​బరేలీలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం.. ఆయన రెండు సీట్లల్లోనీ భారీ లీడింగ్​లో ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం.. వారణాసిలో మోదీకి కనిపిస్తున్న మెజారిటీ కన్నా.. రాయ్​బరేలీలో రాహుల్​ గాంధీకి ఆధిక్యం ఎక్కువగా ఉంది.

కాంగ్రెస్​తో పాటు డీఎంకే, ఎస్​పీ జోరు కొనసాగిస్తుండటంతో మొత్తం మీద ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఇదే కొనసాగితే.. అధికార ఎన్​డీఏకి పలు చోట్ల షాక్​ తప్పకపోవచ్చు.

దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​.. ఎన్​డీఏ ఏకపక్ష విజయం తప్పదని అంచనా వేశాయి. విపక్షాలు తేలిపోతాయని అన్నాయి. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తాజా ట్రెండ్స్​ని చూస్తుంటే.. విపక్ష ఇండియా కూటమికి మెజారిటీ దక్కకపోయినా.. నెంబర్లు మాత్రం మెరుగ్గా ఉండనున్నాయి.

bottom of page