గాంధీభవన్ టూ ఢిల్లీ వయా గచ్చిబౌలి... మీటింగ్‌ల మీద మీటింగ్‌లు.. మంతనాలే మంతనాలు సాగుతూనే వున్నాయి. సీఎల్పీపై సింగిల్ లైన్ స్టేట్‌మెంట్ వచ్చేసింది.. రేవంత్ రెడ్డికే సీఎం కుర్సీ అని హైకమాండ్ లైన్ క్లియర్ చేసిందనే టాక్ రానే వచ్చింది. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో రంగం సిద్ధమైంది. ఇక రేవంత్ అనే నేను....అంటూ ఆవాజ్ రావడమే తరువాయి అనుకునేంతలోపు సీన్ ఛేంజ్.. సీఎం ఎవరినే మ్యాటర్ ఓవర్ టు ఢిల్లీ..
గాంధీభవన్ టూ ఢిల్లీ వయా గచ్చిబౌలి… మీటింగ్‌ల మీద మీటింగ్‌లు.. మంతనాలే మంతనాలు సాగుతూనే వున్నాయి. సీఎల్పీపై సింగిల్ లైన్ స్టేట్‌మెంట్ వచ్చేసింది.. రేవంత్ రెడ్డికే సీఎం కుర్సీ అని హైకమాండ్ లైన్ క్లియర్ చేసిందనే టాక్ రానే వచ్చింది. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో రంగం సిద్ధమైంది. ఇక రేవంత్ అనే నేను….అంటూ ఆవాజ్ రావడమే తరువాయి అనుకునేంతలోపు సీన్ ఛేంజ్.. సీఎం ఎవరినే మ్యాటర్ ఓవర్ టు ఢిల్లీ..
ఎల్లా హోటల్‌లో ఏకవాఖ్య తీర్మానం పూర్తయింది. రేవంతే సీఎం అని హైకమాండ్ లైన్ క్లియర్ చేసిందనే టాక్ వచ్చింది. మరి మళ్లీ సీను ఢిల్లీకి ఎందుకు మారినట్టు? కాంగ్రెస్‌లో సీఎం క్యాండిడేట్‌ను తేల్చడం అంత ఈజీ కాదు.. లాజిక్ అక్కర్లేదు.. ల్యాగ్‌లతో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడమే కాంగ్రెస్ మార్క్ మ్యాజిక్. కాంగ్రెస్‌లో కిరికిరి అట్లుంటది. అని కామన్‌మెన్‌లో డిస్కషన్ మొదలైంది. రేవంత్‌కు రైట్ చెప్పాక ప్రకటించడంలో ఇంకా లేటు ఎందుకు? ఢిల్లీదాక సాగదీత ఎందుకు?
3న ఫలితాలొచ్చాయి. సొంతంగా 64.. సీపీఐని కలుపుకుంటే 65.. అన్నీ మంచి శకునములే. మరి ఇంకా ఎందుకంత ఆలస్యం? అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఓ పనైపోయివుండేది. కానీ మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టినా భిన్నత్వంలో ఏకత్వం వర్కవుట్ కాలేదు. ఈలోపు ప్రమాణస్వీకారం పొద్దుపై మంగళవారం మబ్బు కమ్ముకుంది. సో.. అచ్చెదిన్ కోసం ఈ నెల 7 గురువారం ప్రమాణస్వీకారానికి సుముహుర్తం అని డిసైడయ్యారు. బానే వుంది. మరి సీఎం ఎవరు? డిప్యూటీ ఎవరు? కేబినెట్‌లో ఎవరెవరు? ఆ ముచ్చట అబీ బాకీ హై.
చర్చోపచర్చలు సాగాయి. ఎల్లా హోటల్ నుంచి అబ్జర్వర్స్ టీమ్ ఢిల్లీ బాటపట్టింది. డీకే శివకుమార్, మాణిక్‌రావ్ ఠాక్రే, ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారు. సీల్పీ మీటింగ్‌లో చర్చించిన అంశాలపై హైకమాండ్‌కు నివేదిక ఇస్తారు. ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా సీఎం ఛాన్స్ ఎవరికి? డిప్యూటీ ఎవరు? కేబినెట్ కూర్పు ఎలా? ఇత్యాది అంశాలపై స్పష్టమైన ప్రకటన వుంటుందని క్లారిటీ ఇచ్చారు మాణిక్ ఠాకూర్
ఎల్లా హోటల్‌ల్లో భిన్నత్వం.. ఏకత్వం కోసం అలా అలా ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే డెసిషన్ ఇక ఫైనల్. అదీ సంగతి. టికెటైనా.. సీఎం సీటైనా ఠపీమనీ ఖరారు చేయడం కాంగ్రెస్‌లో అంత ఈజీ కాదనడానికి ఎల్లా హోటల్ టూ ఢిల్లీ పరిణామాలే ఓ నిదర్శనం. ఢిల్లీకి చేరిన గచ్చిబౌలి హైడ్రామాకు ది ఎండ్ కార్డ్ పడ్డానికి మధ్యలో ఇంకెన్ని బ్రేకులో.. షాకులో చూడాల్సిందే. మోత్తానికి ప్రమాణ స్వీకారం కోర్టు హైదరాబాద్‌లోనే. కానీ ఇప్పుడు బాల్ మాత్రం ఢిల్లీలో ఉంది. టికెట్ల మొదలు సీఎం ఎంపిక దాక మ్యాటర్ ఏదైనా సరే ఠపీమనీ తేల్చడం అంటే కాంగ్రెస్‌లో అంత ఈజీకాదు. అంతర్గత ప్రజాస్వామ్యం ఆరేంజ్‌లో ఉంటుంది మరి.🗳️🏛️