top of page
Shiva YT

🏡 ఇంటింటికీ వాటిని పంపిణీ చేయాలి.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

🌐 తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. 🗳️ ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 🔊

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాక అమలు చేసే 5 ప్రధాన హామీల గ్యారంటీ పత్రాన్ని ఈ నెల 17 న తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభలో అగ్రనేత సోనియాగాంధీ విడుజదల చేస్తారని వెల్లడించారు. 🌟 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో ఆదివారం సాయంత్రం జూమ్ ద్వారా ఆయన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 🎙️ అలాగే పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 🤝 ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 17వ తేదిన బహిరంగ సభ పూర్తయ్యాక 18వ తేదీన ఉదయం 11 గంటలకు 119 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు చేరుకుంటారని చెప్పారు. 🇮🇳


bottom of page