top of page

కండ్లకలక వచ్చిన వారి కళ్ళలోకి చూస్తే మనకూ వస్తాయా?. 🧐

పాత రోజుల్లో కండ్ల కలకలు ఉన్న వారి కళ్ళలోకి చూస్తే చాలు కండ్ల కలకలు వచ్చేస్తాయి అనేవారు. నిజం చెప్పాలంటే ఈ మాట ఇప్పటికీ చాల మంది అంటుంటారు కూడా. 🦠👁️ అయితే ఇందులో నిజమెంత? నిజంగానే చూస్తేనే వచ్చేస్తాయా? వర్షాకాలం ప్రారంభం లోనే ఈ కండ్ల కలకల కేసులు ఎక్కువగా కనిపిస్తాయి.

పాత రోజుల్లో కండ్ల కలకలు ఉన్న వారి కళ్ళలోకి చూస్తే చాలు కండ్ల కలకలు వచ్చేస్తాయి అనేవారు. నిజం చెప్పాలంటే ఈ మాట ఇప్పటికీ చాల మంది అంటుంటారు కూడా. 🦠👁️ అయితే ఇందులో నిజమెంత? నిజంగానే చూస్తేనే వచ్చేస్తాయా? వర్షాకాలం ప్రారంభం లోనే ఈ కండ్ల కలకల కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. 🌧️ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కండ్లకలకలు విజృంభిస్తున్నాయి. మన చిన్నప్పటి నుండి మన బామ్మ, తాత చెప్పినట్లు చూస్తేనే ఇవి వచ్చేస్తాయి అనడంలో ఎలాంటి నిజం లేదు. 🦠వాస్తవానికి ఇదొక వైరస్ లాంటింది. 🦠🔬 ఈ కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్‌లో ఇది కూడా ఒకటి. ఇది వ్యాపించే ప్రదేశాల్లో పాఠశాలలు, కళాశాలలు చాల ప్రధానమైనవి.ఇక్కడి నుండి అన్ని కుటుంబాలకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. కళ్లలోకి కళ్ళు పెట్టి చూడటం వల్ల కాదు నీట్‌గా లేకపోవడం వల్ల ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి అతన్ని కన్నుపై చేతిలో నలిపి, లేదా కంట్లో కారుతున్న నీటిని తుడిచి కడుక్కోకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటారు. 👋 అదే ప్రదేశాన్ని మళ్లీ ఇంకొకరు పట్టుకుని.. తిరిగి మళ్ళీ కళ్ళలో పెట్టుకుని ఇలా ఒకరి నుండి ఒకరికి ఈ బాక్టీరియా సోకుతూ చాల వేగంగా వ్యాపిస్తుంది. 🦠


 
 
bottom of page