రూ.500లకే సిలిండర్ పథకం.. ముందు మొత్తం ధర చెల్లించాల్సిందే! 😃
- Suresh D
- Feb 26, 2024
- 1 min read
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మంగళవారం మరో రెండు పథకాలను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలు అమల్లోకి రానున్నాయి.
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మంగళవారం మరో రెండు పథకాలను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలు అమల్లోకి రానున్నాయి. కాగా, సాధారణతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకువస్తోంది. అయితే, లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి మొత్తాన్ని చెల్లించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. అనంతరం రూ.500కు అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రీయింబర్స్ చేయడానికి సిద్ధమవుతోంది. 💸
ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రాయితీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.955 ఉంటే.. లబ్దిదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.40 పోను మిగతా రూ.415ని రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని సమాచారం. 💰
అయితే, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక్కోచోట ఒక్కో ధర ఉంది. హైదరాబాద్‌లో రూ.955 ఉంటే.. మిగత పట్టణాల్లో రూ.970, 974గా ఉండటానికి రవాణా ఛార్జీల వ్యత్యాసమే కారణం. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరికి కేంద్రం నుంచి సిలిండర్‌కు రూ.340 రాయితీ లభిస్తోంది. మహాలక్ష్మి పథకంలో ఎంపికైన లబ్దిదారులు సిలిండర్‌కు చెల్లించే ధరలో కేంద్ర రాయితీ పోను.. మిగతా మొత్తం రూ.500 కంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు సిలిండర్ ధర రూ.970 ఉందనుకుంటే లబ్దిదారుడు చెల్లించాల్సిందే రూ.500, కేంద్ర రాయితీ రూ.340 పోను రూ.130ని రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా జమ చేస్తుంది. దూర ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలతో సిలిండర్ ధర అదనంగా ఉన్నా ఆ భారం ప్రజలపై పడొద్దని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 🚌
మరోవైపు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు మహాలక్ష్మి పథకం కింద లబ్దిదారుల జాబితాలను జిల్లాల వారిగా అధికారులు సోమవారం అందజేయనున్నట్టు సమాచారం. అడ్వాన్సు మొత్తాన్ని కూడా చెల్లించనుంది. ఈ మేరకు రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇచ్చే సిలిండర్ల సంఖ్యను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ మొత్తం ఎప్పటికప్పుడు ఆయిల్ కంపెనీలకు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. 💼