top of page
MediaFx

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..


తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది..ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే 24 గంటలలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి అధిక మోతాదులో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అదే సమయంలో మరికొన్ని జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ చత్తీస్గడ్ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తు వరకు విస్తీరించింది, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు ఆవర్తనం చెందుతుందని చెప్పారు. దీంతో సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో అల్పపీడనం కొనసాగుతోందని ప్రకటించింది. అంతేకాదు ఈ నెల 19న పశ్చిమ -మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సిబ్బంది తెలిపింది. దీంతో గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి అధిక మోతాదులో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

bottom of page