📢 కేటీఆర్ మరో సారి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరాలన్నారు. 🗣️
ఎన్నారైలకు టికెట్ అమ్ముకున్నది ఎవరో చెప్పాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 📜 అలాగే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఎన్నారై అంటూ రేవంత్ మాటలకు ధీటైన సమాధానం ఇచ్చారు. 💬 తెలంగాణ బలిదేవత ఎవరో అందరికీ తెలుసని.. బలిదానం, నియంతృత్వం గురించి కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. 🤔 అలాగే ఎన్నారై అన్న పదంపై కేటీఆర్ స్పందిస్తూ.. నాన్ రిలయబుల్ ఇండియన్ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. 📣 ఇచ్చిన హామీల్లో పావు వంతు కూడా అమలు కాలేదు. మార్చి 17 కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుందన్నారు. 100 రోజుల్లో చెప్పిన హామీలు అమలు చేయకుంటే అప్పుడు కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. 🗳️ తొలి క్యాబినెట్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పినట్లు గుర్తుచేశారు. 💪 బానిసలు పోతే.. బానిసకు ఓ బానిస అన్నట్లు ఉంది కాంగ్రెస్ పరిస్థితి అన్నారు. ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి భాష మారడం లేదని విమర్శించారు. 💼 విద్యుత్ శాఖలో అప్పుల కన్నా ఆస్తులే అధికంగా ఉన్నాయన్నారు. ⚡