top of page
MediaFx

లోక్‌సభ ఎన్నికలు-2024 కౌంటింగ్ సమయం ఆసన్నం


లోక్‌సభ ఎన్నికలు-2024తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కౌంటింగ్ ప్రక్రియ రేపే (మంగళవారం) జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. కౌంటింగ్‌కు ముందు రోజైన నేడు (సోమవారం) మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. జూన్ 3న మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఇది గతంలో నిర్వహించిన దశలవారీ సమావేశాల కంటే భిన్నం. కౌంటింగ్‌కు ముందు రోజు ఈసీ మీడియా ముందుకు వస్తోంది. దీంతో ఎన్నికల సంఘం వెల్లడించబోయే అంశాలపై ఆసక్తి నెలకొంది.

ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 543 లోక్‌సభ స్థానాలకు రేపు (మంగళవారం) ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ఆరంభమవనుంది. ఇందుకు సంబంధించి ఈసీ ఇప్పటికే కీలకమైన సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం కూడా ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈవీఎం, వీవీప్యాట్‌లు, పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించి అనుసరించాల్సిన ప్రక్రియపై సూచనలు చేసింది.

bottom of page