🔥 వైరల్ వీడియోలో అంకిత్ బగియాల్ అనే కళాకారుడు ఎమ్ఎస్ ధోని చిత్రాన్ని పుచ్చకాయపై చెక్కిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇది వేగంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో అతడు తన ప్రతిభతో పుచ్చకాయపై MSD అంటే మన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిత్రాన్ని అద్భుతంగా చెక్కాడు. కళాకారుడు పుచ్చకాయపై కెప్టెన్ కూల్ ఫేస్‌ని వాస్తవిక పద్ధతిలో చెక్కాడు. 🌶️🎨
📹 అంకిత్ ఈ వీడియోని గత సోమవారం రోజునే తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ను షేర్ చేశాడు. ధోని పట్ల తనకున్న గౌరవం, అభిమానాన్ని వ్యక్తీకరించడానికి పుచ్చకాయపై MSD చిత్రాన్ని చెక్కినట్లు చెప్పాడు. ఆ పోస్ట్‌కి క్యాప్షన్‌తో పాటు ఎంఎస్ ధోనీని మిస్ యూ అని పేర్కొన్నాడు. 📹👨🍳