భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది.
ఇప్పుడు రెండో మ్యాచ్‌కి ఇరు జట్లు సిద్ధమయ్యాయి. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 12వ తేదీ మంగళవారం గెబారాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కూడా జరగడం అనుమానమేనని తెలుస్తోంది. 🏏
టాస్ కుదరకపోవడంతో డర్బన్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇది అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇప్పుడు మంగళవారం జరగనున్న రెండో టీ20కి కూడా వర్షం అంతరాయం కలుగుతుందని సమాచారం. 📆
భారతదేశం vs దక్షిణాఫ్రికా 2వ T20 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ+
హాట్‌స్టార్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో ఉచితంగా చూడొచ్చు. 📺