top of page
Shiva YT

20 కోట్లైనా తగ్గేదేలే.. ఈ 5గురి ప్లేయర్సే ఫ్రాంచైజీల టార్గెట్. 🏏

ఈ ఐదుగురు ప్లేయర్స్ లిస్టులో వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ ముందున్నాడు. ఫైనల్‌లో భారీ సెంచరీతో ట్రోఫీని టీమిండియా నుంచి లాక్కున్న హెడ్.. ఫార్మాట్ ఏదైనా కూడా పరుగుల వరద పారిస్తాడు. ఇక అతడి దూకుడైన ఆటతీరే.. ఫ్రాంచైజీలను ఆకట్టుకుంది. ఇతడి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య పెద్ద వార్ జరగొచ్చు.

లిస్టులో ఉన్న మరో ప్లేయర్.. రచిన్ రవీంద్ర. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌తో వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించాడు. మెగాటోర్నీలో 578 పరుగులు సాధించి.. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. ఆల్‌రౌండర్ కోసం వెతుకుతున్న ఫ్రాంచైజీలు ఇతడిపై కాసుల వర్షం కురిపించడం ఖాయం.

18 మంది ఆటగాళ్లు తప్పనిసరి: ఐపీఎల్‌లో ఒక జట్టులో 18 మంది ఆటగాళ్లు ఉండటం తప్పనిసరి. అంటే, వేలం తర్వాత ఏ ఐపీఎల్ జట్టు 18 మంది కంటే తక్కువ ఆటగాళ్లను కలిగి ఉండకూడదు. అయితే, ఇక్కడ గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లు ఉండడం తప్పనిసరి కాదు.

వీళ్లిద్దరే కాదు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తోన్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్.. న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారెల్ మిచెల్, దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కోసం కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయ్. ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్, ముంబై జట్లు వీరి కోసం కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. 🏏

bottom of page