top of page

🏏🏟️ ఉప్పల్‌లో భారత్, ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు 🏏🏟️

గురువారం (జనవరి 25) నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది.

గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈనెల 29 వరకు అంటే మొత్తం ఐదు రోజుల పాటు జరగనుంది. మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నాయి. ప్రాక్టీస్‌ కూడా షురూ చేశాయి. సుమారు ఆరేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా నగరవాసులతో పాటు క్రికెట్‌ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో స్టేడియంలోకి క్రికెట్ ప్రేక్షకులను ఉదయం 6.30 నిమిషాలకే అనుమతించనున్నారు. గ్రౌండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కొనసాగే ఐదు రోజుల పాటు ఉప్పల్‌ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. 🚦🚗🛣️

 
 
bottom of page