top of page
Shiva YT

🏏 జింబాబ్వే పర్యటనకు భారత జట్టు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌.. 🇮🇳🇿🇼

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది టీమిండియా. స్వదేశంలో జరుగుతోన్న ఈ సిరీస్ 1-1తో సమంగా ఉంది.

 సిరీస్‌లోని మూడో మ్యాచ్ ఫిబ్రవరి 25 నుంచి 29 వరకు రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమ్ ఇండియా నేరుగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆడనుంది. ఈ టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌, అమెరికాలో నిర్వహించనున్నారు. అయితే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. జింబాబ్వే, టీమిండియాల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జింబాబ్వే క్రికెట్‌ ట్వీట్‌ చేసింది. ఈ టీ20 సిరీస్‌ను జూలై నెలలో నిర్వహించనున్నారు. సిరీస్‌లోని మొత్తం ఐదు మ్యాచ్‌లు హరారే క్రికెట్ క్లబ్ స్టేడియంలో జరుగుతాయని జింబాబ్వే క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టీం ఇండియా వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్ మొదటి మ్యాచ్, జూలై 6 రెండవ మ్యాచ్, జూలై 7 మూడో మ్యాచ్, జూలై 10 నాలుగో మ్యాచ్, జూలై 13 ఐదవ మ్యాచ్, జూలై 14 🏆🇮🇳🇿🇼


bottom of page