top of page
Shiva YT

🏏 విరాట్‌ కోహ్లీ వర్సెస్‌ రోహిత్‌..🏏

🏏 విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ… ఎవరు బెస్ట్? ఈ ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. ఈ ప్రశ్నకు కొందరు కింగ్ కోహ్లీ అని, మరికొందరు హిట్ మ్యాన్ అని సమాధానమిసస్తారు.

అయితే ఇదే ప్రశ్నను టీమ్ ఇండియా పేసర్ మహమ్మద్ షమీని అడగ్గా తెలివైన సమాధానం చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహమ్మద్ షమీకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరిలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు అని ప్రశ్నించారు. ఇద్దరినీ దగ్గరుండి చూసిన షమీకి ఒకరిని ఎంచుకోవడం కష్టమైంది. అందుకే తెలివిగా సమాధానాలు ఇస్తూ ఇద్దరినీ మెచ్చుకున్నాడు షమీ. ఈ ప్రశ్నకు షమీ సమాధానమిస్తూ, విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌. ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అందుకే నేను విరాట్ కోహ్లీని ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌ అని పిలుస్తాను’ అని షమీ బదులిచ్చాడు. అదే సమయంలో రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం, విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌, రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌ ‘ అని మహ్మద్ షమీ సమాధానమిచ్చాడు. తన తెలివైన సమాధానంతో కింగ్ కోహ్లి, హిట్‌మ్యాన్‌లలో ఎవరు బెస్ట్ అనే చర్చకు మహ్మద్ షమీ ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇప్పుడు షమీ తెలివైన సమాధానానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానుల నుండి కూడా భారీ ప్రశంసలు లభిస్తున్నాయి. 🏏🌟🔥

bottom of page