🌟🏏కెమెరాకు దొరికిన కింగ్ కోహ్లీ లంచ్ టైంలో బిజీబిజీ..🍽️👨👩👧👦
- Shiva YT
- Feb 27, 2024
- 1 min read
ప్రస్తుతం బాలీవుడ్ నటి అనుష్క శర్మ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఇటీవలే రెండోసారి తల్లిదండ్రులు అయిన అనుష్క-విరాట్ జోడీ.. తమ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నారు. కొడుకు ‘అకాయ్’ పుట్టినప్పటి నుంచి ఈ దంపతులు లండన్‌లోనే ఉంటున్నారు.
కొడుకు రాకతో, తల్లి అనుష్క ఫుల్ బిజీగా మారింది. అప్పుడే పుట్టిన కొడుకు అకాయ్ సంరక్షణలో అనుష్క బిజీగా ఉండగా, విరాట్ కోహ్లీ మాత్రం తన ముద్దుల కూతురు వామికతో చాలా సమయం గడుపుతున్నాడు. తాజాగా ఈ తండ్రీకూతుళ్లు లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ కనిపించారు.
రెస్టారెంట్‌లో వామిక-విరాట్ కోహ్లీ సందడి..
📸🍽️ ఇటీవల, విరాట్ కోహ్లి తన ముద్దుల కూతురు వామికను లంచ్ డేట్‌కి తీసుకెళ్లినట్లు లండన్ నుంచి ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో ఈ ఇద్దరూ లండన్‌లోని ఒక రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నట్లు చూడొచ్చు. ఫొటోలో వామిక నీలం-తెలుపు పట్టీలతో కూడిన స్వెటర్‌ను ధరించి కనిపించగా, విరాట్ నల్లటి దుస్తులను, తలపై బీనీ క్యాప్ ధరించి కనిపించాడు.
ఈ ఫొటోలో, ఇద్దరూ టేబుల్‌పై ఆహారం తింటున్నారు. తండ్రి, కుమార్తెల ఈ అందమైన క్షణాన్ని కొంతమంది రహస్యంగా తమ ఫోన్‌లో బంధించారు. ఇలా Redditలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విరాట్, వామిక జంటగా ఉన్న ఈ ఫొటోపై అభిమానులు చాలా ప్రేమను కురిపిస్తున్నారు.
🌍 వారసుడు వచ్చినట్లు ప్రకటించిన అనుష్క..
ఇటీవల, నటి అనుష్క శర్మ తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. 15 ఫిబ్రవరి 2024న అనుష్క-విరాట్ వారి రెండవ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. వీరు తమ కొడుకుకు చాలా ప్రత్యేకమైన పేరు పెట్టారు. అకాయ్ ప్రపంచంలోకి వచ్చిన వెంటనే, అతని పేరుకు అర్థం తెలుసుకోవడానికి కోట్లాది మంది గూగుల్‌లో వెతుకుతున్నారు. విరాట్, అనుష్క తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో 20 ఫిబ్రవరి 2024న అకాయ్ పుట్టినట్లు ప్రకటించారు. వారి కుమార్తె వామిక 11 జనవరి 2021న జన్మించింది. 🎉👨👩👧👦✨








































