top of page
MediaFx

షాకింగ్‌..ముంబై ఇండియన్స్‌ను వీడనున్న రోహిత్!

IPL 17వ సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది , ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ అభిమానుల్లో ఒక రకమైన అసంతృప్తి వాతావరణం నెలకొంది. దీనికి తోడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్‌ల్లో ముంబై చేతిలో ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల చేతుల్లో ముంబై ఓడిపోయింది. ఈ 3 పరాజయాలు హార్దిక్ పై కోపాన్ని మరింత పెంచాయి. తాజాగా ముంబై ఇండియన్స్ టీమ్ పై ‘NEWS 24’ సంచలనాత్మక కథనం ప్రచురించింది. దీని ప్రకారం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ పట్ల అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ 17వ సీజన్ తర్వాత రోహిత్ శర్మ ముంబైని విడిచిపెడతాడని కూడా అందులో పేర్కొంది. వీరితో పాటు సీనియర్ ప్లేయర్లు జస్ ప్రీత్ బుమ్రా, మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్య కుమార్ యాదమ్ ముంబైను వీడే యోచనలో ఉన్నారని న్యూస్ 24 తెలిపింది.

రోహిత్ శర్మ, హార్దిక్ సీనియర్ ఆటగాళ్లు. రోహిత్ నాయకత్వంలో ముంబైని ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా మార్చాడు. మరోవైపు హార్దిక్ నాయకత్వంలో ముంబై విజయం ఖాతా కూడా తెరవలేకపోయింది. రోహిత్‌కు క్రికెట్, కెప్టెన్సీలో ఘనమైన అనుభవం ఉంది. అయితే ఇప్పుడు హార్దిక్ ముంబై కెప్టెన్‌గా ఉన్నందున, నిర్ణయాధికారం అంతా హార్దిక్‌కే ఉంది. అందుకే వీరిద్దరి అనుభవం ముంబై విజయంలో ఉపయోగపడేలా కనిపించడం లేదు. న్యూస్ 24 కథనం ప్రకారం, రోహిత్‌ను మళ్లీ కెప్టెన్‌గా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనికి ముందు కెప్టెన్ హార్దిక్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి 2 మ్యాచ్‌ల అవకాశం ఇవ్వవచ్చు. ఈ రెండు మ్యాచుల్లో ముంబైను గెలిపించడంతో పాటు ప్లేయర్ గానూ వ్యక్తిగతంగా రాణించాలని హార్దిక్ కు ముంబై ఫ్రాంఛైజీ షరతు విధించిందట. అయితే ఇవన్నీ రూమర్లే. వీటికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

bottom of page