🏏 క్షణాల్లో అమ్ముడైన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ టిక్కెట్లు.. 🏏
- Shiva YT
- Aug 18, 2023
- 1 min read
క్రికెట్ ఫీల్డ్‌లో ఏ దేశంలోనైనా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో కచ్చితంగా క్రేజ్ ఉంటుంది.

శ్రీలంకలో జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి కూడా అలాంటిదే కనిపిస్తుంది. ఇక్కడ మొదట ఖరీదైన టిక్కెట్ల అమ్మకం చాలా వేగంగా కనిపించింది. ఈ మ్యాచ్ కోసం అత్యంత ఖరీదైన టిక్కెట్ ధర 300 US డాలర్లుగా నిలిచింది. ఇది రూ.25,000లుగా నిలిచింది.
ఈ మ్యాచ్ కోసం అతి తక్కువ టిక్కెట్ ధర 30 US డాలర్లు అంటే రూ.2,500లు. అదే సమయంలో V-VIP, VIP స్టాండ్‌ల టిక్కెట్‌లన్నీ పూర్తిగా అమ్ముడయ్యాయి. వీఐపీ స్టాండ్ టిక్కెట్ ధర దాదాపు రూ.10,500లుగా మారింది. ఆసియా కప్ మ్యాచ్‌ల టిక్కెట్‌లను pcb.bookme.pk వెబ్‌సైట్‌నుంచి కొనుగోలు చేయవచ్చు. 🎟️📲