top of page
Shiva YT

🏏🇵🇰 కోహ్లీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్..

🏆 ప్రస్తుతం ఆసియాకప్‌లో తిరుగులేని జోరు కొనసాగిస్తున్న బాబర్ అజాం సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ టీం.. సూపర్ 4 దశలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 🏆 లీగ్ నుంచి తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది.

🇵🇰 ఈ మ్యాచ్‌లో కేవలం 17 పరుగులకే పెవిలియన్ చేరిన పాక్ సారథి బాబర్ అజాం.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 🏏 దీంతో ప్రపంచంలోనే తొలి ప్లేయర్ కం కెప్టెన్‌గా తన పేరును లిఖించుకున్నాడు. 🌍

🏆 వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం, T20 నంబర్ 3, టెస్ట్‌లలో 4వ ర్యాంక్‌లో కొనసాగుతోన్న బాబర్.. తన నాయకత్వంలో ODI ఫార్మాట్‌లో పాకిస్తాన్ జట్టును No.1 స్థానానికి నడిపించాడు. 🥇

🏏 గతవారం ముల్తాన్‌లో నేపాల్‌తో జరిగిన ఆసియాకప్ తొలి మ్యాచ్‌లో 151 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన బాబర్.. బంగ్లాదేశ్‌పై 22 బంతుల్లో 17 పరుగులు చేసి వన్డేల చరిత్రలో తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 2000 పరుగులు పూర్తి చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. 🏅

🏆 ఈ మైలురాయిని చేరుకోవడానికి బాబర్ 31 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, ధోనీ తర్వాత టీమిండియా కెప్టెన్సీని చేపట్టిన విరాట్ 36 ఇన్నింగ్స్‌ల్లో భారత వన్డే జట్టుకెప్టెన్‌గా 2000 పరుగులు పూర్తి చేశాడు. 🌟

🏆 ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (41 ఇన్నింగ్స్‌లు), ఆస్ట్రేలియా 2015 వన్డే ప్రపంచకప్ విజేత కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (947 ఇన్నింగ్స్‌లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. 🏅

🏏 మే 31, 2015న అదే మైదానంలో జింబాబ్వేపై పాకిస్తాన్ తరపున బాబర్ తన ODI అరంగేట్రం చేశాడు. 106 ODI ఇన్నింగ్స్‌లలో 19 సెంచరీలు చేశాడు. దీంతో పాటు పాకిస్థాన్ జట్టు తరపున అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 🌟🏏

bottom of page