top of page
Shiva YT

🏏🇮🇳 ప్రతిభ ఫుల్‌గా ఉన్నా ఏం లాభం.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్‌లో చోటివ్వని సెలెక్టెర్లు..

🏆 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌నకు భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కనిపించనున్నాడు.

🏏 అలాగే, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు అవకాశం లేకుండా పోయింది. శాంసన్‌తో పాటు టీమిండియా జట్టులో కనిపించని కొంతమంది స్టార్ ప్లేయర్‌ల జాబితా ఇప్పుడు చూద్దాం..

🏅 శిఖర్ ధావన్: లెఫ్టార్మ్ ఓపెనర్ శిఖర్ ధావన్ టీమ్ ఇండియా తరపున 137 వన్డేల్లో 6793 పరుగులు చేశాడు. కానీ, 37 ఏళ్ల ధావన్‌ను ఈ వన్డే ప్రపంచకప్ జట్టులోకి తీసుకోలేదు.

🏏 రవిచంద్రన్ అశ్విన్: టీమిండియా తరపున 113 వన్డే మ్యాచ్‌ల నుంచి 151 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రపంచకప్‌నకు ఎంపిక కాలేదు. డబ్ల్యూటీసీలోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి కచ్చితంగా వన్డే ప్రపంచకప్ జట్టులో చేరతాడని అంతా భావించారు. కానీ, చివరకు మొండిచేయి చూపించారు.

🏆 భువనేశ్వర్ కుమార్: భారత్ తరపున 121 వన్డే మ్యాచ్‌లు ఆడిన స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ మొత్తం 141 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈసారి ఆయనను కూడా ఎంపికకు పరిగణనలోకి తీసుకోలేదు.

🏏 యుజ్వేంద్ర చాహల్: ఈ వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని ఆశించిన సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. టీమిండియా తరపున 13 మ్యాచుల్లో 55.71 సగటుతో 390 పరుగులు చేసిన శాంసన్ కూడా జాబితాలో చోటు దక్కిచున్నాడు. 🏅


bottom of page