🤝 ఇషాన్, రాహుల్ కలిసి ఆడితే..! 🇮🇳 ఇషాన్, రాహుల్ ఇద్దరూ కలిసి ఆడే అవకాశం ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఇదే జరిగితే శ్రేయాస్ అయ్యర్ తుది జట్టు నుంచి వైదొలిగినట్టే. దీన్ని బట్టి టీమిండియాకు నష్టం జరిగినట్టే.
🌟 ఇషాన్ ఆడటం ఖాయం.! 🏏 ఇషాన్ కంటిన్యూగా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. వన్డేల్లో గత 4 ఇన్నింగ్స్‌ల్లో 50కిపైగా పరుగులు చేశాడు. ఇక అతిపెద్ద విషయం ఏంటంటే.. పల్లెకెలెలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు 5వ నంబర్‌లో ఆడిన ఇషాన్.. అజేయంగా 82 పరుగులు చేశాడు. 🌟
🏏 అయ్యర్ Vs రాహుల్ 4వ స్థానంలో? మరోవైపు, టీమ్ ఇండియాకు కూడా నంబర్ 4 సమస్య ఉంది, దీనికి శ్రేయాస్ అయ్యర్ సరైన ఆప్షన్. అయ్యర్ 4వ స్థానంలో ఉన్నప్పుడు వన్డేల్లో 21 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో అతను 45.50 సగటుతో 819 పరుగులు చేశాడు. 🏏🏅👍