ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంకు ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వస్తున్న సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో అడవులను నరికివేస్తున్నారని అన్నారు.
నాకు చాలా నచ్చింది ఏంటి అంటే దివంగత కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించిన చిత్రం గంధడగుడి. ఈ సినిమా థీమ్ ఏంటి అంటే అడవులను కాపాడడం. నాకు కూడా ఇలాంటి సినిమాల్లో నటించాలా అనిపించేది. ఇంతకుముందు సినిమాల్లో హీరోలు అడవులని కాపాడేవారు. కానీ ఈరోజుల్లో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడవులను నరికివేయడం హీరోయిజం అయిపోయింది. నేను ఆ పరిశ్రమలో ఉన్నానని అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంటుంది. ఇలాంటివి తగ్గి మళ్లీ అడవుల ప్రాముఖ్యత తెలిసేలా సినిమాలు రావాలని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడవులను నరికివేయడం లాంటివి ఉండడంతో కావాలని వ్యాఖ్యలు చేస్తున్నాడని అల్లు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.