top of page

భారతీయ సినిమాకు దిక్సూచి.. దాదాసాహెబ్ ఫాల్కే

భారతీయ సినిమాకు పితామహుడిగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే శతజయంతి సందర్భంగా 54 సంవత్సరాల క్రితం 1969లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వా లని నిర్ణయించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా ఏటా జాతీయ చలనచిత్ర వేడుకల్లో గ్రహీత. లకు అందచేస్తారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నతమైనది. దాదాసాహెబ్ ఫాల్కే ఆవార్డు. 2021 సంవత్సరానికి 53వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును వహీదా రెహ మాన్ ఎంపికైనట్టు 2023 సెప్టెంబర్ 26న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. అవార్డుకు ఎంపిక చేసిన కమీటీలో ఆశాపరేఖ్, చిరంజీవి, పరేష్ రావెల్, ప్రజిత్. చటర్జీ, శేఖర్ కపూర్ ఉన్నారు.


భారతీయ సినిమాకు పితామహుడిగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే శతజయంతి సందర్భంగా 54 సంవత్సరాల క్రితం 1969లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వా లని నిర్ణయించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా ఏటా జాతీయ చలనచిత్ర వేడుకల్లో గ్రహీత. లకు అందచేస్తారు. ప్రతి సంవత్సరం వివిధ భాషల్లో భారతీయ సినిమాకు గణనీయమైన సేవలు చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం. ప్రారంభంలో ఈ అవార్డు విలువ రూ.2 లక్షలు, దాదాసాహెబ్ అవార్డు గ్రహీతలకు శాలువా, స్వర్ణ, కంకణం, రూ.10,00,000 నగదు అందజేస్తారు.


దాదాసాహెబ్ ఫాల్కే (1870-1944)


దర్శకుడు, నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే భారతదేశ మొట్టమొదటి నిడివి మూర్ఖ చలన చిత్రం రాజాహ రిశ్చంద్ర తీశారు. ఈ చిత్రాన్ని 1913లో విడుదల చేశారు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1989లో ఏర్పాటు చేశారు.


వివిధ భాషల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు


హిందీ 28, బెంగాలీ 11, తెలుగు 7, తమిళం 3, మళయాళం, అస్సామీ , మరాఠి ,కన్నడ నుంచి ఒక్కొక్కరు అందుకున్నారు.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పటి వరకు 53 మంది అందుకున్నారు. మొదటి గ్రహీత దేవికా రాణి. ఈమె 1936 ఫిబ్రవరి 3న తమిళనాడులోని రంగల్పట్లో జన్మించారు.

2003లో జరిగే 69వ జాతీయ చలన చిత్ర పురస్కా రాల ప్రదానోత్సవాల సందర్భంగా వహీదా రెహ మాస్కు అవార్డును అందజేస్తారు.

అక్కినేని నాగేశ్వరరావుతో తొలిసారిగా రోజులు మారాయి (1955) తో వెండి తెరపై మెరిసిన వహీదా అందులో 'ఎరువాక సాగారో రన్నో చిన్నన్నా.. అనే పాటకు చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తరవాత ఎన్టీఆర్తో కలిసి జయ సింహలో నటించాక, హిందీ చలన చిత్రరంగంలో ప్రవేశించి హిందీలో సి.ఐ.డి చిత్రంలో తొలిసారిగా నటించింది. హిందీ చలన చిత్రరంగంలో ప్యాసా. కాగజ్ పూల్, కాలాబజార్, బాత్ ఏక్ రాత్ కీ,సాహిబ్ బీబీ ఔర్ గులామ్, నీల్ కమల్, చాంద్ వి కా చాంద్, రామ్ ఔక్ శ్యామ్, ఖామోసి లాంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పిం చింది, రేష్మా ఔర్ షేర్లో తన నటనతో జాతీయస్థా యిలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నది..

భారత సినీరంగం అభ్యున్నతికి చేసిన సేవకు ఆమెకు భారత ప్రభుత్వం 1872లో పద్మశ్రీ, 2011లో పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించినది. 2008 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నది.


వహీదా రెహమాన్తో కలిసి నటించిన కమల్ జాతు ప్రేమించి పెళ్లి చేసుకుని బెంగుళూరులో స్థిరపడ్డారు.

పైడి జయరాజ్: తెలంగాణ గడ్డపై పుట్టి, భారతీయ చలన చిత్ర రంగంలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో వాటి చెప్పిన గొప్ప నటుడు. ఈయన జన్మస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల, పైడి జయరాజ్ హిందీ . లోనే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం సహా పలు భాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటిం చిన అగ్రగణ్యుడు..



దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విశేషాలు

మరణించిన తరవాత పృద్వీరాజ్ కపూర్ (1971), వినోద్ ఖన్నా (2017)కు ప్రకటించారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తండ్రి, కొడుకులు పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ అందుకున్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు

1969 (17వ NFA) దేవికా రాణి హిందీ

1970 (18వ NFA ) బీరేంద్రనాథ్ సిర్కార్ బెంగాలీ

1971 (19వ NFA) పృథ్వీరాజ్ కపూర్ హిందీ

1972 (20వ NFA) పంకజ్ ముల్లిక్ బెంగాలీ& హిందీ

1973 (21వ NFA) రూబీ మైయర్స్ హిందీ

1974 (22వ NFA) B. N. రెడ్డి తెలుగు

1975 (23వ NFA) ధీరేంద్ర నాథ్ గంగూలీ బెంగాలీ

1976 (24వ NFA) కానన్ దేవి బెంగాలీ

1977 (25వ NFA) నితిన్ బోస్ బెంగాలీ&హిందీ

1978 (26వ NFA) రాయ్‌చంద్ బోరల్ బెంగాలీ&హిందీ

1979 (27వ NFA) సోహ్రాబ్ మోడీ హిందీ

1980 (28వ NFA) పైడి జైరాజ్ హిందీ

1981 (29వ NFA) నౌషాద్ హిందీ

1982 (30వ NFA) L. V. ప్రసాద్ తెలుగు&తమిళం & హిందీ

1983 (31వ NFA) దుర్గా ఖోటే హిందీ& మరాఠీ

1984 (32వ NFA) సత్యజిత్ రే బెంగాలీ

1985 (33వ NFA) V. శాంతారామ్ హిందీ& మరాఠీ

1986 (34వ NFA) బి. నాగి రెడ్డి తెలుగు

1987 (35వ NFA) రాజ్ కపూర్ హిందీ

1988 (36వ NFA) అశోక్ కుమార్ హిందీ

1989 (37వ NFA) లతా మంగేష్కర్ హిందీ&మరాఠీ

1990 (38వ NFA) అక్కినేని నాగేశ్వరరావు తెలుగు

1991 (39వ NFA) భల్జీ పెంధార్కర్ మరాఠీ

1992 (40వ NFA) భూపేన్ హజారికా అస్సామీ

1993 (41వ NFA) మజ్రూహ్ సుల్తాన్‌పురి హిందీ

1994 (42వ NFA) దిలీప్ కుమార్ హిందీ

1995 (43వ NFA) రాజ్‌కుమార్ కన్నడ

1996 (44వ NFA) శివాజీ గణేశన్ తమిళం

1997 (45వ NFA) కవి ప్రదీప్ హిందీ

1998 (46వ NFA) B. R. చోప్రా హిందీ

1999 (47వ NFA) హృషికేశ్ ముఖర్జీ హిందీ

2000 (48వ NFA) ఆశా భోంస్లే హిందీ& మరాఠీ

2001 (49వ NFA) యష్ చోప్రా హిందీ

2002 (50వ NFA) దేవ్ ఆనంద్ హిందీ

2003 (51వ NFA) మృణాల్ సేన్ బెంగాలీ&హిందీ

2004 (52వ NFA) అదూర్ గోపాలకృష్ణన్ మలయాళం

2005 (53వ NFA) శ్యామ్ బెనెగల్ హిందీ

2006 (54వ NFA) తపన్ సిన్హా బెంగాలీ&హిందీ

2007 (55వ NFA) మన్నా డే బెంగాలీ&హిందీ

2008 (56వ NFA) V. K. మూర్తి హిందీ

2009 (57వ NFA) డి. రామానాయుడు తెలుగు

2010 (58వ NFA) కె. బాలచందర్ తమిళం

2011 (59వ NFA) సౌమిత్ర ఛటర్జీ బెంగాలీ

2012 (60వ NFA) ప్రాణ్ హిందీ

2013 (61వ NFA) గుల్జార్ హిందీ

2014 (62వ NFA) శశి కపూర్ హిందీ

2015 (63వ NFA) మనోజ్ కుమార్ హిందీ

2016 (64వ NFA) కె. విశ్వనాథ్ తెలుగు

2017 (65వ NFA) వినోద్ ఖన్నా హిందీ

2018 (66వ NFA) అమితాబ్ బచ్చన్ హిందీ

2019 (67వ NFA) రజనీకాంత్ (ప్రకటించారు) తమిళం

2020 (68వ NFA) ఆశా పరేఖ్ (ప్రకటించబడింది) హిందీ

2021 రజనీకాంత్ & ఆశా పరేఖ్ (అందుకున్నారు) వరుసగా తమిళం & హిందీ

2022 రేఖ హిందీ.


 
 
bottom of page