తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు దళపతి విజయ్. విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇటీవల విజయ్ నటించిన సినిమాలు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా అవలీలగా వందల కోట్లను వసూల్ చేస్తున్నాయి. ఇటీవలే లియో సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయినా కూడా భారీగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు విజయ్. ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్న అని అనౌన్స్ చేసి పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశారు.
దాంతో విజయ్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. అలాగే విజయ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారని ప్రచారం జరగడంతో .. అభిమానుల్లో టెన్షన్ కూడా మొదలయ్యింది. ప్రస్తుతం విజయ్ గోట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే విజయ్ తన తల్లి కోసం గుడి కట్టించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
విజయ్ తన తల్లి దండ్రులతో కలిసి ఉండటం లేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఆయన తల్లి శోభా అంటే చాలా ఇష్టం.. ఇందుకు నిదర్శనంగా ఆయన ఓ గుడిని కట్టించారట. చెన్నైలోని స్థానిక కొరట్టూర్‌లో తన తల్లికి ఇష్టమైన సాయి బాబా కోసం ఆలయాన్ని నిర్మించాడట విజయ్. ఫిబ్రవరి నెలలో ఈ ఆలయంలో కుంభాభిషేకం కూడా జరిగిందట.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.