దర్శకుడిగా దళపతి విజయ్ కొడుకు..
- Suresh D
- Aug 28, 2023
- 1 min read
తమిళ టాప్ హీరో దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు? టెక్నికల్ క్రూ సంగతేంటి? అనే విషయాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలో వీటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా రానున్నాయి.

కొడుకు సినిమా ఎంట్రీ గురించి విజయ్ కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు. తనను నటుడిగా పరిచయం చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ‘ఉప్పెన’ సినిమాను తమిళంలో జేసన్ సంజయ్‌తో రీమేక్ చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో పాటు మలయాళ ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ కూడా జేసన్ సంజయ్‌కు ఒక కథ చెప్పారట. కానీ ఈ ప్రతిపాదనను కొడుకు సున్నితంగా తిరస్కరించాడని విజయ్ ‘బీస్ట్’ సినిమా సందర్భంగా దర్శకుడు నెల్సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
గత కొన్ని సంవత్సరాలుగా లండన్‌లో డైరెక్షన్‌కు సంబంధించిన కోర్స్ కూడా సంజయ్ చేశాడు. నటుడిగా ఎంట్రీ ఇస్తారని అందరూ అనుకున్నప్పటికీ ఊహించని విధంగా దర్శకత్వం వైపు జేసన్ సంజయ్ మళ్లాడు. ఇలా సినిమా ప్రకటించగానే తండ్రితో సినిమా ఎప్పుడంటూ ఫ్యాన్స్ అడగటం ప్రారంభించారు.