top of page
MediaFx

కూతురు సితారకి మహేష్ స్పెషల్ విషెస్.!


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ లో భారీ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. మరి మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా (SSMB 29) దీనిని పాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ఈ భారీ చిత్రం మొదలు పెట్టే ముందు గ్యాప్ లోనే ఈ చిత్రం కోసం తనని తాను ప్రిపేర్ చేసుకుంటునే ఉన్న సమయాన్ని ఫ్యామిలీతో కూడా మహేష్ గడుపుతున్నారు.

అయితే లేటెస్ట్ గా నేడు తన గారాల పట్టి ఘట్టమనేని సితార పుట్టినరోజు రావడంతో మహేష్ సోషల్ మీడియాలో తన స్పెషల్ విషెస్ ని అందించాడు. సితార సెల్ఫీ పిక్ ని పోస్ట్ చేసి హ్యాపీ 12 నా చిట్టి తల్లి, ఒక స్టార్ లా ఎప్పటికీ షైన్ అవుతూ ఉండు ఈ స్పెషల్ డే నీకు మరింత స్పెషల్ గా మారాలి. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ బ్యూటిఫుల్ విషెస్ ని మహేష్ బాబు తెలిపాడు. దీనితో ఈ స్పెషల్ పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. అలాగే అభిమానులు కూడా సితారకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలివజేస్తున్నారు.


bottom of page