డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో లేకపోయినా కూడా తెలుగు వాళ్లంతా డేవిడ్ వార్నర్ కి వీరాభిమానులే. ఐపీఎల్ వచ్చిందంటే డేవిడ్ వార్నర్ ఆట కోసం జట్టుతో సంబంధం లేకుండా ఎదురుచూస్తూ ఉంటారు.
డేవిడ్ అనగానే క్రికెట్ మాత్రమే కాదు.. యాక్టింగ్, రీల్స్, సాంగ్స్, స్టెప్పులు అన్నీ గుర్తొస్తాయి. తెలుగు, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డేవిడ్ యాక్టింగ్ స్కిల్స్ కి అందరూ పిచ్చోళ్లు అయిపోయారు. అప్పటి నుంచి డేవిడ్ భాయ్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. డేవిడ్ కూడా ఇండియన్స్ అన్నా, తెలుగు వాళ్లు అన్నా ఎంతో అభిమానంగా ఉంటాడు. అయితే ఇప్పుడు డేవిడ్ భాయ్ జక్కన్న సెట్స్ లో కనపడి అందరికీ షాకిచ్చాడు.
సాధారణంగా డేవిడ్ వార్నర్ ఎన్నో రీల్స్ చేశాడు. వాటిలో రాజమౌళి సినిమాలకు సంబంధించిన సీన్స్, సాంగ్స్ కూడా ఉన్నాయి. అయితే నిజంగా డేవిడ్ వార్నర్ రాజమౌళి సెట్స్ లో ఒక యాక్టర్ గా వస్తాడు అని మాత్రం ఎవరూ అనుకోలేదు. కానీ, అది నిజంగానే నిజం అయ్యింది. డేవిడ్ భాయ్, జక్కన్నతో కలిసి సెట్స్ లో యాక్టింగ్ ఇరగదీశాడు. బాహుబలి సినిమాని డేవిడ్ వార్నర్ తో రీమేక్ చేశారు. అందుకు సంబంధించిన విజువర్స్, సీన్స్ అన్నీ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నిజంగానే డేవిడ్ వార్నర్ రాజమౌళి డైరెక్షన్ లో పని చేశాడా? అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇది నిజంగా నిజమా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే వీళ్లంతా ఒక యాడ్ షూట్ లో ఇలా సందడి చేశారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా క్రెడ్ యూపీఐ పేమెంట్స్ గురించే యాడ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రాజమౌళి, డేవిడ్ వార్నర్ కూడా క్రెడ్ యూపీఐ కోసం ఒక యాడ్ చేశారు. ఆ యాడ్ షూట్ కి సంబంధిచిన ఫొటోలు, వీడియోలే ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. జక్కన్నతో కలిసి డేవిడ్ వార్నర్ నటించాడు. కానీ, అది కేవలం యాడ్ కోసం మాత్రమే. ఎవరూ కంగారు పడి రాజమౌళి దర్శకత్వంలో డేవిడ్ భాయ్ యాక్ట్ చేశాడు అనుకోకండి. ఇప్పుడు ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది కాబట్టి క్రికెట్ కి రిలేట్ చేస్తూ క్రెడ్ వాళ్లు ఈ యాడ్ షూట్ చేశారు.🎥✨