top of page
Shiva YT

పార్లమెంట్ టియర్ గ్యాస్ ఘటనపై లోతుగా విచారణ..🏛️💨

పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ సాగర్‌శర్మ, మనోరంజన్‌, నీలం, ఆమోల్‌ షిండే, గురుగావ్‌లో వారికి ఆశ్రయం కల్పించిన విక్కీశర్మ, అతని భార్యను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. నీలం గతంలో పలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారా.? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఇండియాగేట్‌ దగ్గర మీటింగ్‌ పెట్టుకొని స్మోక్‌ క్యాన్లను అందరూ పంచుకున్నారు. ఆరుగురు పాసులు తీసుకొని లోపలికి వెళ్లాలని పథకం రచించారు. కానీ మనో రంజన్‌, సాగర్‌శర్మకు మాత్రమే పాసులు లభించాయి. వీళ్లిద్దరు మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా పీఏ ద్వారా పాసుల కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకి స్మోక్‌ క్యాన్లు ప్రయోగించారు సాగర్‌శర్మ, మనో రంజన్‌. పార్లమెంట్‌ కాంపౌండ్‌ వెలుపల గేట్‌ దగ్గర పొగబాంబు ప్రయోగించి నీలం, ఆమోల్‌ షిండే నినాదాలు చేశారు. వాళ్లిద్దరిని పోలీసులు పట్టుకోగానే విక్కీశర్మ, లలిత్‌ ఝూ పరారయ్యారు. అనంతరం విక్కీశర్మ, అతని భార్యను గుర్గావ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు సాగర్‌శర్మ ఈ-రిక్షా నడుపుకుంటూ జీవనం సాగించేవాడని తెలిసింది. రెండ్రోజుల క్రితం స్నేహితులతో వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఈ ఘటనకు పాల్పడ్డట్లు వెల్లడించారు. 🚨🔍 👩‍⚖️పార్లమెంట్ ఘటనలో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు

ఐపిసి సెక్షన్‌ 120-బి (నేరపూరిత కుట్ర), 452 (నిబంధనలు అతిక్రమించడం), సెక్షన్ 153 (అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం ), 186 (ప్రజా విధుల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం), 353 (దాడి నేరపూరిత కుట్ర), ఉపా చట్టం (UAPA) 16,18 సెక్షన్ల కింద కేసునమోదు చేసిన పోలీసులు. తదుపరి విచారణ కోసం కేసును స్పెషల్ సెల్‌కు బదిలీ చేశారు. పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసులో ఏడో వ్యక్తిని కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పరారీలో ఉన్న లలిత్ ఝా కోసం వెతుకుతున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‎కు చెందిన రెండు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నాయి. రాజస్థాన్ నీమ్రానా వద్ద లలిత్ ఝా చివరి లొకేషన్‎ను పోలీసులు గుర్తించారు. నిన్నటి నుంచి లలిత్ ఝా కోసం రంగంలోకి దిగిన ముమ్మరంగా గాలిస్తున్నారు.

bottom of page