‘దేవర’ ఎంట్రీ సీన్ ఇదేనా.. కొరటాల ఏం ప్లాన్ చేస్తున్నాడు.?
- MediaFx
- Sep 11, 2024
- 1 min read
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూ. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ (Devara). అప్పుడెప్పుడో అరవింద సమేత వీర రాఘవ(Aravindha Sametha Veera Raghava) తర్వాత తారక్ సోలోగా వస్తుండటం.. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ తారక్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో తెలుగులో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత ధైర్యం కాదు. కాదూ కూడదు అని మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్నవుతా..’ అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా బైరా (సైఫ్ అలీఖాన్) తారక్ (దేవర) కు మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలు నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకటి దేవర పాత్రలో నటిస్తుండగా.. రెండోది దేవర కొడుకు పాత్రలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయితే ట్రైలర్ చూస్తే.. దేవర ఎంట్రీ సీన్ రివీల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో దేవర సోరచేపపై ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దేవర సోరచేపపై సవారీ చేయడం. ఆ తర్వాత దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి పడేయడం ట్రైలర్‌లో కనిపిస్తుంది. దీంతో అభిమానులందరూ చిన్న దేవర ఎంట్రీ సీన్ ఇదే అని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు దేవర పాత్రకు కూడా సాలిడ్ ఎంట్రీ సీన్ ఉండబోతున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావడానికి సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.