top of page
Suresh D

‘దేవర’ ఆగమనం.. అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన టీమ్🎥✨

ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో ఆయన ఇంటెన్స్ లుక్ కట్టిపడేస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’ (Devara) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావడంతో ‘దేవర’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివతో పాటు టీమంతా కష్టపడుతోంది. తొలి భాగాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తోంది.

అయితే, ‘దేవర’ టీజర్ కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా రోజులుగా అడుగుతున్నారు. టీజర్ ఎప్పుడు వస్తుంది అంటూ నిర్మాణ సంస్థలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. టీజర్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇటీవల ఇంటర్వ్యూల్లో చెప్పారు. మొత్తానికి అప్‌డేట్ వచ్చేసింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినరోజున ఎన్టీఆర్ తన అభిమానులకు మరో పండగ తీసుకొచ్చారు. టీజర్‌ను జనవరి 8న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది.

‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవర గ్లింప్స్‌ను జవవరి 8న మీ ముందుకు తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ఎన్టీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే, తన కొత్త పోస్టర్‌ను కూడా పొందుపరిచారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ సముద్రంలో పడవపై నిలబడి ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఎన్టీఆర్ నలుపు రంగు పంచ, చొక్కా ధరించి చేతిలో పెద్ద కత్తితో సముద్రపు ఒడ్డున రాళ్లపై నిలబడి ఉంటారు. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ సంబరపడిపోయారు. అయితే, ఈసారి మాత్రం కాస్త స్టైలిష్‌గా, ఇంకాస్త రగ్డ్‌గా ఎన్టీఆర్ ఇంటెన్సివ్ లుక్‌ను తీసుకొచ్చారు. ఈ లుక్ మరింతగా ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది.

bottom of page