చుట్టమల్లే పాట రిలీజ్ అయ్యాక ట్రెండ్ లో ఉండాల్సింది దేవర సినిమా కదా... మరి అదేంటి? తారక్‌కి సంబంధించిన మరో విషయం ఉన్నట్టుండి లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఏదైతేనేం... తారక్ పేరు వినిపిస్తుందనుకోవాలా? దేవరను పక్కకు నెడుతున్న ఆ సినిమా ఏంటని జాగ్రత్తగా ఆరా తీయాలా? మాట్లాడుకుందాం వచ్చేయండి..
నందమూరి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ని విడుదల చేసేసింది దేవర టీమ్. పాట నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. తారక్ - జాన్వీ కెమిస్ట్రీ గురించి భలేగా మాట్లాడుకుంటున్నారు జనాలు. తారక్ మేకోవర్ అయిన తీరుకు ఫిదా అవుతున్నారు. మరి మాట్లాడుకోవడానికి ఇన్ని విషయాలున్నప్పుడు ట్రెండ్‌లో ఉండాల్సింది దేవర మూవీ కదా...
దేవరను క్రాస్ చేసి... ఉన్నట్టుండి ట్రెండ్ అవుతోంది తారక్ - ప్రశాంత్ నీల్ మూవీ. ఈ నెల 9న ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఆల్రెడీ మూవీ ఆఫీస్ తీసుకున్నారు. వర్క్ స్టార్ట్ అయింది. మరి పూజా కార్యక్రమాలు కూడా అదే ప్రాంగణంలో ఉంటాయా? అనేది ప్రస్తుతానికి క్యూరియాసిటీ పెంచుతున్న విషయం.
తారక్‌కి సంబంధించి దేవర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు వార్2 పనులు జరుగుతున్నాయి. ఇంతలోనే నీల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికైతే ఫస్ట్ దేవర పార్ట్ ఒన్ షూట్ కంప్లీట్ చేస్తారు తారక్. ఆ వెంటనే వార్2కి వెళ్తారు. దాంతో పాటు సైమల్‌టైనియస్‌గా నీల్ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటారు.
ఇప్పుడు కనిపిస్తున్న సినారియో బట్టి... వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు విడుదలయ్యాకే దేవర 2 స్టార్ట్ అవుతుందా? లేకపోతే మధ్యలో దేవర 2కి కూడా కాల్షీట్ అడ్జస్ట్ చేస్తారా? సర్దుబాటు చేస్తే ఓకే.. లేకుంటే అప్పటిదాకా కొరటాల ఈ సెకండ్ పార్టు మీదే వర్క్ చేస్తారా? ఇంకేదైనా ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవుతారా? దేవర సెకండ్ చాప్టర్ కోసం ఫ్యాన్స్ ఎన్నేళ్లు వెయిట్ చేయాలి... ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది.