top of page
MediaFx

దేవర‌లో అదిరిపోయే రొమాంటిక్ సాంగ్

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘ఫియర్ సాంగ్’ ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే, దేవర రెండో పాట పై తాజా అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతుంది. రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ రెండో పాట పూర్తిగా రొమాంటిక్ గా ఉండబోతుంది. పైగా సముద్ర తీరంలో సాగే ఈ సూపర్ కూల్ మెలోడీ సాంగ్ మంచి ఫీల్ తో పాటు అద్భుతమైన విజువల్స్ తో సాగుతుందట. 🎶

ఈ రెండో సాంగ్ లోని వి.ఎఫ్.ఎక్స్ విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయని, ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ లుక్స్ కూడా అదిరిపోతాయని.. ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి ఈ సాంగ్ ఫుల్ కిక్ ఇస్తోందని తెలుస్తోంది. 🎥

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 🌟

bottom of page