ఎన్టీఆర్, కొరటాల శివ నుంచి దేవర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ దేవర మూవీ దసరా బరిలోకి రాబోతోంది. షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం కృష్ణమ్మ చిత్ర ప్రమోషన్స్‌లో కొరటాల శివ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో దేవర గురించి కూడా మాట్లాడాడు. దేవర సినిమా ఎన్టీఆర్‌కీ, తనకీ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోందని చెప్పుకొచ్చాడు. ఇకపై వరుసగా అప్డేట్లు వస్తూనే ఉంటాయని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా దేవర నుంచి ఓ అప్డేట్ వచ్చింది. మామూలుగా అయితే దేవర నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందని గత మూడు నాలుగు రోజుల నుంచి రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇంత వరకు సినిమా టీం నుంచి క్లారిటీ రాలేదు. కానీ కాసేపటి క్రితమే దేవర అఫీషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ పడింది. ఫస్ట్ సింగిల్ మీద క్లారిటీ ఇచ్చారు.
ఆన్ ది వే ఆన్ ది వే అంటూ దేవర ఫస్ట్ సింగిల్ రాబోతోందంటూ ట్వీట్ వేసింది చిత్ర యూనిట్. అయితే ఆన్ ది వే అని చెప్పడం వెనుక.. పాట త్వరలోనే వస్తుందనా? లేదంటే పాటలో హుక్ వర్డ్? అన్నది తెలియడం లేదు. ఏది ఏమైనా ఆన్ ది వే మాత్రం ఇప్పుడు బాగానే ట్రెండ్ అవుతోంది.అనిరుధ్ ఎలాంటి పాటను ఇచ్చి ఉంటాడో.. అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దేవర ఆడియో నెట్టింట్లో ట్రెండ్ క్రియేట్ చేసేలా ఉంది. అసలే ఎన్టీఆర్, అనిరుధ్ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సింది. అరవింద సమేతకు చివరి నిమిషంలో అనిరుధ్ ప్లేస్‌లోకి తమన్ వచ్చి చేరాడు. మరి ఎన్టీఆర్ కోసం అనిరుధ్ ఎలాంటి పాటల్ని సెట్ చేశాడో చూడాలి.