top of page
Suresh D

“దేవర” కి చాలా తక్కువ బిజినెస్..?🎥✨

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ .

మరి గ్లోబల్ హిట్ ‘RRR’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్నా సినిమా ఇది కావడంతో గట్టి అంచనాలే ఉన్నాయి.అలాగే రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ కి కూడా మాసివ్ రెస్పాన్స్ ఫ్యాన్స్ నుంచి వచ్చింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సంబంధించి ఇప్పుడు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 125 కోట్లకి పైగానే బిజినెస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది తారక్ కెరీర్ లోనే హైయెస్ట్ మొత్తం కానీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ లో మాత్రం ఒకింత తక్కువే అని తెలుస్తుంది.మరో అవైటెడ్ చిత్రాలు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ , ప్రభాస్ ‘కల్కి 2898ఎడి’  చిత్రాలు కేవలం సింగిల్ రీజియన్ నుంచి 100 కోట్ల మేర బిజినెస్ చేస్తున్నాయి అని బజ్ ఉంది. మరి వాటితో పోలిస్తే అంత క్రేజ్ తర్వాత కూడా దేవర తక్కువే అని చెప్పాలి. మరి ఓవరాల్ దేవర బిజినెస్ ఎంత నెంబర్ దగ్గర ఆగుతుందో చూడాలి.🎥✨


bottom of page