కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ రాయన్. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జే. సూర్య, ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్, అపర్ణ బాల మురళి, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ నేడు వెల్లడించారు.
ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ మే 9, 2024 న రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పది తలల రావణుడు బ్యాక్ గ్రౌండ్ లో ఉండగా, ధనుష్ ఫ్రంట్ లో కనిపిస్తున్న పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.