top of page
Shiva YT

🎬 వైఎస్ జగన్‌ పాత్ర కోసం జీవా ఎంత కష్టపడ్డాడో చూశారా? ‘యాత్ర 2’ 🌟

💔 దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవితాల్లోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రం యాత్ర 2.

సుమారు ఐదేళ్ల క్రితం 2019లో రిలీజైన యాత్రకు ఇది సీక్వెల్‌. మొదటి పార్ట్‌నే తెరకెక్కించిన డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ యాత్ర 2 ను రూపొందించాడు. వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించగా, వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా జీవించి పోయాడు. ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర 2 డీసెంట్‌ టాక్‌ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఏపీ రాజకీయాల ఇతివృత్తంపై సినిమా ఉన్నప్పటికీ సగటు సినీ ప్రేక్షకులు కూడా యాత్ర 2 సినిమాను చూసేందుకు వెళుతున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇక జగన్‌ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా జీవించాడని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళుతోన్న యాత్ర 2 సినిమా గురించి వరుసగా సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు మేకర్స్‌. ఇటీవలే ఇందులోని డిలీటెడ్ సీన్‌ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశారు. తాజాగా మేకింగ్ అఫ్ యాత్ర 2 పేరుతో స్పెషల్‌‌ వీడియోను విడుదల చేశారు మూవీ టీమ్.

📱 ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా ఈ మేకింగ్ వీడియో వైరల్‌ గా మారింది. ఇందులో వైఎస్‌ జ‌గ‌న్ పాత్ర‌లో జీవాని ఎంపిక చేయ‌డం ద‌గ్గ‌ర‌ నుంచి షూటింగ్ ముగింపు వ‌ర‌కు యాత్ర 2 ను సక్సెస్‌ ఫుల్‌ గా తెరకెక్కించడంలో టీమ్‌ చేసిన కష్టం కనిపిస్తుంది. అలాగే మూవీలో హైలెట్‌గా నిలిచిన పలు సన్నివేశాలను ఎలా చిత్రీకరించారు ఈ వీడియోలో చూపించారు. 🎥🌟

bottom of page