పూరి దర్శకత్వంలో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్ పోతినేని. డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో రామ్ కు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే డబుల్ ఇస్మార్ట్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. చార్మితో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
తాజాగా డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ను విడుదల చేశారు . ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. మరోసారి రామ్ తన మాస్ యాక్టింగ్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ కంటే ఈ సినిమాలో మరింత యాక్షన్ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఈ ట్రైలర్ చివరిలో ఫైట్ సీక్వెన్స్ చూపించారు. బహుశా అదే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ అయ్యుండొచ్చు. వీటితో పాటు కావ్య తన అందాలతో ఆడియన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసేసింది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.