top of page
Suresh D

విమర్శలను ఎదుర్కొని విజేతగా ఎదిగిన దర్శకుడు.. అట్లీ బర్త్ డే స్పెషల్🎥🎞️

కోలీవుడ్ స్టార్డ్ డైరెక్టర్‌గా అట్లీకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అట్లీ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. కింగ్ ఖాన్ షారుఖ్‌తో జవాన్ తీసి, వెయ్యి కోట్ల డైరెక్టర్‌గా మారాడు. సౌత్ నుంచి ఈ ఫీట్ అందుకున్న రెండో దర్శకుడిగా రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు.🎥🎞️

రాజా రాణి సినిమాతో అట్లీ దర్శకుడిగా కోలీవుడ్‌లో తన ముద్ర వేసుకున్నాడు. అయితే అది కొత్త పాయింట్ కాకపోయినా మేకింగ్, టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. అట్లీ ఏ సినిమా తీసుకున్నా కథ, కథనాలు కొత్తగా ఉండవు. కానీ మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు కావడంతో తన టేకింగ్, ఎలివేషన్ సీన్లతో సినిమాను అద్భుతంగా మలిచేస్తాడు. విజయ్‌తో తీసిన తేరి, బిగిల్, మెర్సల్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని మించి మరొకటి అనేలా విజయం సాధించాయి. ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా అట్లీ సాగిపోతూ ఉండగా.. షారుఖ్ ఖాన్‌తో కలిసి కనిపించిన ఫోటో ఒకటి వైరల్ అయింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వచ్చిన షారుఖ్‌ను అట్లీ కలిశాడు. ఆ ఫోటో మీద, అందులో అట్లీ కనిపించిన తీరు, అతని రంగు మీద నార్త్ నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేశారు. జాతీయ మీడియా సైతం కాస్త కించపరిచేట్టుగానే కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో అయితే అది మార్పింగ్ ఫోటో అని ప్రచారం చేశారు.

కానీ అట్లీ ఏనాడూ ఈ ట్రోలింగ్‌ను పట్టించుకోలేదు. తన పని ఏదో తాను చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు జవాన్‌తో బాలీవుడ్ డైరెక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. షారుఖ్‌ను చూపించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు.నేటి అట్లీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా మార్మోగిపోతోంది. జవాన్ దెబ్బతో అట్లీ బాలీవుడ్‌కు హాట్ ఫేవరేట్ అయ్యాడు. అక్కడి నుంచి కూడా అట్లీకి విషెస్ అందుతున్నాయి. విమర్శలను ఎదుర్కొని విజేతగా నిలిచాడు అట్లీ.🎥🎞️

bottom of page