top of page
MediaFx

వీడు హీరోగా దొరికాడేంట్రా అనుకున్నా.. డైరెక్టర్ రాజమౌళి..


రాజమౌళి తన సినిమాల్లో ప్రతి పాత్రను చాలా క్షుణ్ణంగా ఆలోచించి చూసుకుంటారు. తను అనుకున్న పాత్రకు ఎవరైతే కరెక్టుగా సెట్ అవుతారో వాళ్లను అచి తూచి తీసుకుంటారు. రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో ట్రిపుల్ ఆర్ మూవీని రూపొందించి స్టివెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజ దర్శకుల మెప్పును పొందారు. ప్రస్తుతం మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత అడ్వెంచర్ డ్రామాగా జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే జక్కన్న సినిమాలో నటించాలని ఎంతోమంది నటీనటులు ఎదురుచూస్తుంటారు. కానీ ఓ హీరో విషయంలో రాజమౌళి మనసులో అనుకున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ మాటలను బయటపెట్టింది స్వయంగా జక్కన్న కావడం గమనార్హం.

అతడు మరెవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా స్టూడెంట్ నెం.1. 2001లో విడుదలైన ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. అయితే తన ఫస్ట్ మూవీలో హీరోగా తారక్ అని.. అతడిని మొదటి సారి చూడగానే “ఓరి దేవుడో.. వీడు దొరికాడేంట్రా.. నా ఫస్ట్ మూవీకి.. మీసాలు సరిగ్గా లేకుండా.. నడక చూసి.. నా ఫస్ట్ మూవీకి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.. వీడు దొరికాడేంట్రా అనుకున్నా.. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన పది రోజులకే తారక్ యాక్టింగ్ స్కిల్స్, టాలెంట్ చూసి షాకయ్యానని.. ఆ తర్వాత తనతో ఫ్రెండ్షిప్ మొదలయ్యిందని చెప్పుకొచ్చాడు ” రాజమౌళి. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

bottom of page